15, మార్చి 2015, ఆదివారం

పుణ్యభూమి నాదేశం నమో నమామి - మేజర్ చంద్రకాంత్

పుణ్యభూమి నాదేశం నమో నమామి..
ధన్యభూమి నాదేశం సదా స్మరామి. ॥పుణ్యభూమి॥
నన్ను కన్న నాదేశం నమో నమామి..
అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి
మహామహుల కన్న తల్లి నా దేశం
మహోజ్వలిత చరిత కన్న భాగ్యోదయ దేశం.... నా దేశం..... ॥పుణ్యభూమి॥
అదిగో ఛత్రపతి.. ద్వజమెత్తిన ప్రజాపతి
మతోన్మాద శక్తులు చురకత్తులు ఝలిపిస్తే
మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే
ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి
మాతృభూమి నుదిటి పై నెత్తుటి తిలకం దిద్దిన మహావీరుడు... సార్వ భౌముడు...
అడుగో అరి భయంకరుడు కట్ట బ్రహ్మన
అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన ॥అడుగో॥
ఒరేయ్‌ ఎందుకు కట్టాలిరా శిస్తు,
నారు పోసావా.... నీరు పెట్టావా ....
కోత కోసావా .... కుప్పనూర్చావా....
ఒరేయ్ తెల్ల కుక్క
కష్టజీవుల ముష్టి మెతుకులు తిని బ్రతికే నీకు శిస్తెందుకు కట్టాలి రా...
అని పెళ పెళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి
ఉరికొయ్యల ఉగ్గుపాలు తాగాడు
కన్న భూమి ఒడిలోనే ఒరిగాడు ॥పుణ్యభూమి॥ ॥నన్ను కన్న ॥
అదిగదిగో...అదిగదిగో... ఆకాశం భల్లున తెల్లారి
వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి అగ్గి పిడుగు అల్లూరి
ఎవడురా నా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు
ఎవడు ఎవడా పొగరు బట్టిన తెల్లదొరగాడెవ్వడు
బ్రతుకు తెరువుకు దేశమొచ్చి భానిసలుగా మమ్మునెంచి
పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెవడికి వచ్చెరా
బడుగు జీవులు బగ్గు మంటే.. ఉడుకు నెత్తురు ఉప్పెనైతె
ఆ చండ్ర నిప్పుల గండ్ర గొడ్డలి పన్ను గడతది చూడరా
అన్న ఆ మన్నెందొర అల్లూరిని చుట్టి ముట్టి
మందీ మార్బలమెట్టి మరఫిరంగులెక్కిపెట్టి
వంద గుళ్ళు ఒక్కసారి పేల్చితే
వందే మాతరం వందే మాతరం వందే మాతరం
వందే మాతరం వందే మాతరం అన్నది ఆ ఆకాశం
అజాదు హిందు ఫౌజు దళపతి నేతాజి
అఖండ భరత జాతి కన్న మరో శివాజి
సాయుద సంగ్రామమే న్యాయమని
స్వతంత్ర్య భారతావని మన స్వర్గమని
ప్రతి మనిషొక సైనికుడై ప్రాణార్పణ చెయ్యాలని
హిందు ఫౌజు జైహింద్ అని నడిపాడు.
గగన శిగలకెగసి కనుమరుగై పోయాడు
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
జోహార్ జోహార్ సుభాష్ చంద్ర బోస్
గాంధీజి కలలు కన్న స్వరాజ్యం
సాధించే సమరం లో అమర జ్యోతులై వెలిగే
ధ్రువ తారల కన్నది ఈ దేశం
చరితార్ధుల కన్నది నా భారతదేశం నా దేశం ॥పుణ్యభూమి॥ ॥నన్ను కన్న ॥

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం - నీకు నేను నాకు నువ్వు

తెలుగు భాష తియ్యదనం... తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మరచిపోతే వాళ్లని నువు మరచినట్టురా
ఇది మరువబోకురా
అమ్మా అన్న పిలుపులోన అనురాగం ధ్వనిస్తుంది
నాన్నా అన్న పదములోన అభిమానం జనిస్తుంది
మమ్మీడాడీలోన ఆ మాధుర్యం ఎక్కడుందీ
మామ అన్నమాట మనసు లోతుల్లో నిలుస్తుంది
అత్తా అంటే చాలు మనకు ఆదరణే లభిస్తుంది
ఆంటీ అంకుల్లోన ఆ ఆప్యాయత ఎక్కడుందీ
పరభాషా జ్ఞానాన్ని సంపాదించు
కానీ నీ భాషలోనే నువ్వు సంభాషించు
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ల ఋణం తీర్చరా
కొంత ఋణం తీర్చరా
కొమ్మల్లోన పక్షులన్ని తమ కూతను మార్చుకోవు
భూమిపైన ప్రాణులన్ని తమ భాషను మరువలేవు
మనుషులమై మనభాషకు ముసుగును తగిలిస్తున్నాము
ప్రపంచాన మేధావులు మన పలుకులు మెచ్చినారు
పొరుగు రాష్ట్ర కవులు కూడ తెలుగును తెగ పొగిడినారు
ఆంధ్రులమై మనభాషకు అన్యాయం చేస్తున్నాము
అభివృద్దికి ఉండాలి నింగే హద్దు
అది భాషా ఆచారాలను మింగెయొద్దు
తల్లిదండ్రి నేర్పినట్టి మాతృభాషరా
ఉగ్గుపాల భాష పలికేందుకు సిగ్గుపడకురా
వెనక్కి తగ్గమాకురా
తెలుగు భాష తియ్యదనం, తెలుగు జాతి గొప్పతనం
తెలుసుకున్న వాళ్లకి తెలుగే ఒక మూలధనం
మమ్మీడాడీ అన్నమాట మరుద్దామురా
అమ్మానాన్నా అంటూ నేటి నుండి పిలుద్దామురా
ప్రతిజ్ఞ పూనుదామురా
చిత్రం : నీకు నేను నాకు నువ్వు
రచన : చంద్రబోస్
గానం: S.P.చరణ్
సంగీతం: ఆర్.పి. పట్నాయక్

జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం - గీతాంజలి


జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువన భగన గరలం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహల కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రెక్కటిల్లిపోయే రంపంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువన భగన గరలం మా పిలుపే ఢమరుకం
ఆడేదే వలపు నర్తనం పాడేదే చిలిపి కీర్తనం
సై అంటె సయ్యాటరో..హేహె
మా వెనుకే ఉంది ఈతరం మా శక్తే మాకు సాధనం
ఢీ అంటే ఢీయ్యాటరో..
నేడేరా నీకు నేస్తము రేపే లేదు
నిన్నంటే నిండు సున్నరా రానేరాదు
ఏడేడు లోకాలతోన బంతాటలాడాలి ఈనాడే
తక తకధిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువన భగన గరలం మా పిలుపే ఢమరుకం
పడనీరా విరిగి ఆకశం విడిపోనీ భూమి ఈక్షణం
మా పాట సాగేనులే..హోహొ
నడి రేయే సూర్యదర్శనం రగిలింది వయసు ఇంధనం
మా వేడి రక్తాలకే..
ఓ మాట ఒక్కబాణము మా సిద్ధాంతం
పోరాటం మాకు ప్రాణము మా వేదాంతం
జోహారు చెయ్యాలి లోకం మా జోరు చూశాక ఈనాడే
తక తకధిమి తకఝను
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
మరల మరల జననం రానీరా మరల మరల మరణం
మింగేస్తాం భువన భగన గరలం మా పిలుపే ఢమరుకం
మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహల కత్తుల వంతెన
మా దెబ్బకు దిక్కులు ప్రెక్కటిల్లిపోయే రంపంపంపం
జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం
దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం
తకిత తకిత తకధిమి తకధిమి తక
తకిత తకిత తకధిమి తకధిమి తక
తకిత తకిత తకధిమి తకధిమి తక
తకిత తాం తాం తాం తాం తాం